మెగా ఫ్యామిలీ హీరోలని మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే మెగాస్టార్ చిరంజీవి అని చెబుతారు. ఆయన స్పూర్తితోనే మెగా హీరోలు అందరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్ తేజ్ తన అభిమాన నటుడు రజనీకాంత్ అని చెప్పి ఆశ్చర్యపరచారు. తాజాగా అభిమానులతో చాటింగ్ చేసిన వైష్ణవ్ ఈ విషయాన్నిరివీల్ చేశాడు.
రజనీకాంత్ నటించిన ఏ సినిమా మీకు ఇష్టం అని మరో నెటిజన్ అడగగా, దానికి శివాజి అని సమాధానం ఇచ్చారు. ఇక మలయాళ నటి నజ్రియా నజీమ్ తన ఫేవరేట్ యాక్ట్రెస్ అని పేర్కొన్నాడు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్‌కు పలు సినిమా ఆఫర్స్ వస్తుండగా, ఇప్పటికే కొన్నింటికి సైన్ చేశాడు. తన రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేశాడు వైష్ణవ్. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.