అల్లు శిరీష్ హీరోగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ మధ్యే ఐదేండ్లు పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శిరీష్‌కు అభిమానులను తీసుకొచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా నుంచి ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎమోషనల్ డైలాగ్‌తో ఆకట్టుకున్నారు శిరీష్. ఇందులో అల్లు శిరీష్ కారెక్టర్ ఈ డైలాగ్ చెప్తుంది. ఎవర్నీ ఎక్కువగా ప్రేమించకూడదు.. అలా చేస్తే ఓ బ్యాగేజ్ మనం మోస్తున్నట్లే.. మనల్ని మనం చంపుకునేలా చేస్తుంది ఈ ప్రేమ అంటూ శిరీష్ చెప్పిన డైలాగ్ చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ మాటలు చాలా మందికి కనెక్ట్ అయ్యాయి.
మరీ ముఖ్యంగా ఓ అభిమాని అయితే దీన్ని చాలా వ్యక్తిగతంగానూ తీసుకున్నాడు. తనకు తాను అప్లై చేసుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసి సేమ్ ఫీలింగ్ అంటూ పోస్ట్ చేశాడు. దానికి వెంటనే స్పందించిన అల్లు శిరీష్.. అయ్యో ఏమైంది బ్రదర్ అంటూ అడిగాడు. అది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే. నీకు కూడా మంచి కాలం వస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటూ రిప్లై ఇచ్చాడు శిరీష్. దాంతో పాటు ఓ హగ్, హార్ట్ సింబల్స్ ఎమోజీలుగా పోస్ట్ చేశాడు శిరీష్. అలా ఆయన అభిమానిని ఓదార్చాడు.ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమాతో బిజీగా ఉన్నాడు. అందులో ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నాడు శిరీష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిన్మా చూస్తే పాగల్ అయిపోతారు.. పాగల్ మూవీ పబ్లిక్ టాక్
‘మా’లో హీట్ పెంచుతున్న ఎన్నికల లొల్లి
మా సభ్యులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసిన నరేష్
కలలోనే నన్ను అరెస్ట్ చేయగలరు.. బిగ్ బాస్ భామ సంచలన కామెంట్స్