Meenakshi Chaudhary | ప్రస్తుతం సౌతిండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది మీనాక్షి చౌదరి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 31న దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు టీం మెంబర్స్.
బిజీగా ఉన్న ఈ భామ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర (Vishwambhara)లో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు తెరపైకి రావడమే కాదు.. వికీపీడియా కాస్ట్ సెక్షన్లో మీనాక్షి చౌదరి పేరు కూడా దర్శనమిస్తుంది. ఈ విషయమై లక్కీ భాస్కర్ ప్రమోషన్స్‌లో స్పష్టత ఇచ్చింది. నేను విశ్వంభరలో నటించడం లేదు. నేను ఈ సినిమా చేస్తున్నారని ఎవరు చెప్పారో నాకు తెలియదు. నా పేరు వికీపీడియాలో ఉందని తెలుసు. ప్రతీ ఒక్కరూ నేను విశ్వంభరలో నటిస్తున్నానని చెప్తున్నారు. అలాంటిదేం లేదు. ప్రతీ ఇంటర్వ్యూలో నాకు ఈ ప్రశ్న వేస్తున్నారు. ఒకవేళ నేను భాగస్వామ్యం అయితే నేను ప్రకటిస్తా. లేదంటే ఎలాంటి ప్రకటన చేయనంటూ చెప్పుకొచ్చింది. దీంతో పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేసింది.
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. గేమ్ ఛేంజర్ విడుదల నేపథ్యంలో వేసవిలో రిలీజయ్యే అవకాశాలున్నాయి. మీనాక్షి చౌదరి మరోవైపు వెంకీ అనిల్ 3, మెకానిక్, మట్కా చిత్రాల్లో నటిస్తోంది.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?