Mathu Vadalara 2 | శ్రీ సింహా (Sri Simha), సత్య కాంబినేషన్లో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా (Mathu Vadalara). నరేశ్ అగస్త్య మరో లీడ్ రోల్లో నటించాడు. రితేశ్ రానా (డెబ్యూ) దర్శకత్వం వహించిన ఈ మూవీకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీసింహా, సత్య మరోసారి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
సీక్వెల్లో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా మత్తు వదలరా 2 టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తామనేది తెలియజేస్తూ మరో లుక్ షేర్ చేశారు. ఈ చిత్ర టీజర్‌ను ఆగస్టు 30న ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫరియా అబ్దుల్లా కొంచెం ఫన్ యాంగిల్లో పిస్తోల్ చేతపట్టుకుని బెదిరిస్తున్నట్టు కనిపిస్తుండగా.. శ్రీసింహా, సత్య భయపడుతుండటం చూడొచ్చు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్లు కూడా షేర్ చేశారు. భారీ నేరాలు. అధిక వాటాలు… భారీ నవ్వులు అంటూ షేర్ చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు కాల భైరవ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
It all begins!
Double the dose of comedy, thrills and entertainment ❤🔥#MathuVadalara2 Teaser out on 30th August at 11.07 AM 💥💥In cinemas on 13th September, 2024.
A @RiteshRana sequel.#MV2 @Simhakoduri23 @fariaabdullah2 #Satya @kaalabhairava7 @ClapEntrtmnt… pic.twitter.com/ILpv04DcOf
— BA Raju’s Team (@baraju_SuperHit) August 28, 2024
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?