Mass Jathara | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తోన్న మూవీ మాస్ జాతర (Mass Jathara). సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తు్న్నాడు. రవితేజ 75 (RT75)గా వస్తోన్న ఈ చిత్రం గత సంక్రాంతికే రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతీ సారి ఒక డేట్ చెప్పడం వాయిదా పడటం జరుగుతుండటంతో అభిమానుల్లో విడుదల ఎప్పుడని డైలమా కొనసాగుతోంది. అయితే ఈ డైలమాకు చెక్ పెట్టేశాడు రవితేజ.
సంక్రాంతి అయిపోయింది.. సమ్మర్ అయిపోయింది.. వినాయక చవితి అయిపోయింది.. మాస్ జాతర ఎప్పుడు ? అని ఆది అడుగుతుంటే.. ఈ సారి మాత్రం పక్కా అంటున్నాడు రవితేజ. ఏమైందంటే ఓ ఫైట్ సీక్వెన్స్‌లో కాలుకు గాయమైంది. ఇన్ని గాయాలు ఎప్పుడు కాలేదు. ఏం చేయను నేను. వినాయక చవితి ఆగస్టు 27 ఫిక్స్ అని అంటే.. ఆ డేట్ కూడా పోయిందని ఆది మళ్లీ రవితేజ దగ్గరకు వచ్చాడు. దీంతో వెంటనే రవితేజ చింటు (నిర్మాత నాగవంశీ)కు ఫోన్ చేసి మన పరిస్థితేంటి అని అడిగిన తర్వాత ఇదిగో ఈయన (గణపతి) మీద ఒట్టేసి చెబుతున్నా అక్టోబర్ 31న ఫిక్స్.. ఈ సారి విడుదల పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సారి మాస్ జాతర థియేటర్లలోకి రావడం ఖాయమైనట్టేనని స్పష్టమవడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే మాస్ జాతరపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు రవితేజ.
Sankranthi Ayipoyindhi,
Summer Ayipoyindhi,
Vinayaka Chavithi Ayipoyindhi…#MassJathara Yepudu? 🤔Eesari matram release pakkaa!! 💥😎
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX
— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025
రిలీజ్ పోస్టర్..
It’s time for non-stop whistles and celebrations in theatres from OCTOBER 31st! 🥳🕺
Mass Maharaaj @RaviTeja_offl is ready to set the theatres on fire with full-on Mass entertainment! 🔥
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు 🔱 – Team #MassJathara #MassJatharaOnOct31st… pic.twitter.com/aXauStQ3mw
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 రిలీజ్ టైం.. నైజాం మూవీ లవర్స్‌కు నిరాశే..!
Nayanthara | ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుంచి శశిరేఖ పరిచయం