Kantara Chapter 1 | శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తోన్న కాంతార ప్రీక్వెల్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
అయితే నైజాం మూవీ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ నైజాంలో ఈ సాయంత్రం ఎలాంటి ప్రీమియర్స్ లేవని ప్రకటించింది. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ షో రేపు ఉదయం 7:45 గంటలకు ప్రారంభం కానుందని తెలిపింది. తాజా వార్త కాంతార చాప్టర్ 1ను ముందుగానే చూడాలనుకున్న ప్రేక్షకులకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం కాంతార చాప్టర్ 1 ప్రీమియర్స్ నేడు రాత్రి 10 గంటలకు మొదలుకానున్నాయి. భారీ బడ్జెట్‌తో డివైన్, మిథికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జయరామ్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్ , గుల్షన్ దేవయ్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
OFFICIAL UPDATE ⚡
No Premiere Shows in Nizam Today.#KantaraChapter1 – First Show Starts Tomorrow at 7:45 AM Across Nizam 🔥Book Your Tickets Now 🎟️ https://t.co/5qhvZOlHoz
Grand Release Across NIZAM Tomorrow by @MythriRelease ✨ #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/6cAqaa7ri5
— Mythri Movie Distributors LLP (@MythriRelease) October 1, 2025
Nayanthara | ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుంచి శశిరేఖ పరిచయం
Akkineni Nagarjuna | AI దుర్వినియోగంపై నాగార్జున పోరాటం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు