Marco 2 | మలయాళంతోపాటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యాక్టర్లలో ఒకడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). జనతాగ్యారేజ్, ఖిలాడీ, యశోద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ రీసెంట్గా మార్కో (Marco) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మార్క్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కాగా యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందని ఇన్సైడ్ టాక్. తాజా కథనాల ప్రకారం ఉన్ని ముకుందన్ సీక్వెల్ గురించి మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్‌లాల్‌ను కలిసి.. ఇదే సినిమా విషయమే చర్చించాడట. ఇదే నిజమైత మలయాళ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన మార్కోలో ఇషాన్ శౌలత్, అభిమన్యు ఎస్ థిలకన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్, సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. షరీఫ్ అహ్మద్ తెరకెక్కించారు.
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?