మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) సినీ లవర్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మంజుల నటి మాత్రమే కాదు..నిర్మాత, డైరెక్టర్ కూడా. 1998లో సమ్మర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో యాకర్ గా తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత తండ్రి కృష్ణ వారసులిగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి నాని సినిమాతో నిర్మాతగా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాలను నిర్మించింది. 2018లో మనసుకు నచ్చింది సినిమా డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టింది.
ఈ సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సిల్వర్ స్క్క్రీన్ పై కనిపించక దశాబ్దంపైనే అవుతోంది. మంజుల ప్రస్తుతం సుమంత్ హీరోగా నటిస్తోన్న మళ్లీ మొదలైంది (Malli Modalaindi) సినిమాలో డాక్టర్ మిత్ర (Dr. Mitra ) పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ మంజుల లుక్ ఒకటి విడుదల చేశారు. మళ్లీ మొదలైంది చిత్రంలో థెరపిస్ట్ డాక్టర్ మిత్ర పాత్రలో నటించడం చాలా ఫన్ గా ఎక్జయిటింగ్ గా ఉంది. సినిమా విడుదల కోసం ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నా..సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా తన ఎక్జయిట్ మెంట్ ను షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ కు సుమంత్ ధన్యవాదాలు సిస్టర్ అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. విడాకులు, రెండో పెళ్లి నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో సుమంత్, నైనా గంగూలీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ డైరెక్టర్. మంజుల చివరిసారిగా ఆరెంజ్ చిత్రంలో రాంచరణ్ కు సోదరిగా నటించింది
Great listener & A Good advisor.📝
— BA Raju's Team (@baraju_SuperHit) August 8, 2021
Ever smiling @ManjulaOfficial is back once again, as Dr.Mitra in #MalliModalaindi. @iSumanth @NainaGtweets @hasinimani@tgkeerthikumar @anuprubens @GRNSivakumaar @PradeepERagav@ArjunSurisetty #KRajashekarReddy #CharanTej #RedCinemas pic.twitter.com/puikKIGUWH
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?