ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ

Maa elections | ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సరిగ్గా 1000 మంది కూడా లేని మా అసోసియేషన్ ఎన్నికల కోసం నిజమైన రాజకీయాల స్థాయిలో రచ్చ చేస్తున్నారు సిని’మా’ సభ్యులు. కేవలం 900 పైచిలుకు పైగా ఓట్లు ఉండే అసోసియేషన్ ఎన్నికల కోసం గత రెండు నెలలుగా మామూలు హంగామా చేయడం లేదు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. దీంతో కొంతమంది మా సభ్యులు నోటికి పనిచెబుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి అనే విషయం కూడా మరిచిపోతున్నారు. కలిసి షూటింగ్స్ చేసుకోవాలి సినిమాల్లో నటించాలి అనే విషయం కూడా మరిచిపోయి.. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత జీవితంపై కూడా బురదజల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఉన్న జీవిత రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మోహన్ బాబు అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.. కేవలం ఆయన ఫోన్ చేసి అడిగారు అని మీరు ఓటు వేయవద్దు అని జీవిత చెప్పింది. దీనిపై మంచు విష్ణు సీరియస్ అయ్యాడు. ఎన్నికల ముందు ఎవరు ఎవర్ని.. ఎప్పుడు ఎందుకు కలుస్తారో మనకు తెలియదా అంటూ సీరియస్ అయ్యాడు మంచు విష్ణు. మొన్న మోహన్ బాబు ను రాజశేఖర్ వచ్చి కలవలేదా.. దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నించాడు విష్ణు. దీనికి అంతే ధీటుగా జీవిత బదులిచ్చింది. మోహన్ బాబును తన భర్త రాజశేఖర్ కలిసిన మాట వాస్తవమే.. కానీ అది మా ఎన్నికల కోసం మాత్రం కాదు అని క్లారిటీ ఇచ్చింది.

మా ఎన్నికలను చిరంజీవి వర్సెస్ మోహన్ బాబుగా బయట అనుకుంటున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే మోహన్ బాబును కలిశారని చెప్పింది. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు మధ్యలో మోహన్ బాబు ఇల్లు ఉండటంతో వెళ్లి ఆయన్ను కలిసి వచ్చాడు.. కానీ ప్రత్యేకంగా వెళ్లి భేటీ కాలేదని జీవిత రాజశేఖర్ క్లారిటీ ఇచ్చింది. అలాగే మా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారని.. అంతేతప్ప స్వప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేసింది. అనవసరంగా రాజశేఖర్ పేరును మధ్యలోకి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Manchu Vishnu | సొంత డబ్బులతో ‘మా’ భవనం..మంచు విష్ణు మేనిఫెస్టో ఇదే
Hema | నాపై దుష్ప్రచారం..నరేశ్, కరాటే కల్యాణిపై హేమ ఫిర్యాదు
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

