‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకీ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) , మంచు విష్ణు (Manchu Vishnu) మధ్యే పోటీ నెలకొంది. గెలుపుపై రెండు ప్యానెళ్ల సభ్యులు చాలా ధీమాగా ఉన్నారు. తాజాగా మంచు విష్ణు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సొంత డబ్బులతో మా భవనం నిర్మిస్తామని ఈ సందర్భంగా విష్ణు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతాం. అర్హులైన సభ్యులకు ప్రభుత్వంతో మాట్లాడి ఇళ్లు కట్టిస్తాం.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
మా సభ్యులకు ఈఎస్ఐ, హెల్త్ కార్డులు
మా సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య
అర్హులైన సభ్యులందరికీ పెన్షన్
మహిళల రక్షణకు హైపవర్ ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
మా సభ్యత్వ ఫీజు రూ.లక్ష నుంచి రూ.75 వేలకు తగ్గింపు
అర్హులైన మా సభ్యుల పిల్లల పెళ్లి ఖర్చులకు రూ.1.16 లక్షలు సాయం
మా సభ్యులందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్
నటీనటులకు అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపకల్పన
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు