Manchu Vishnu | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మందికి స్పూర్తిని కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. దేశం కోసం త్యాగాలు చేసిన త్రివిధ దళాల కుటుంబాలకు తనవంతుగా సపోర్ట్ నిలిచేందుకు ముందుకొచ్చాడు. మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ అయిన విష్ణు సాయుధ బలగాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. వారిని గౌరవించే విధంగా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తున్నట్టు ప్రకటించాడు.
త్రివిధ దళాల్లో పనిచేస్తున్న తెలుగు వారి పిల్లలకు 50 శాతం స్కాలర్ షిప్‌ను అందించబోతున్నట్టు తెలియజేశాడు. ఈ అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ, ఏపీలకు మాత్రమే కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అందిచే అన్నికోర్సులకు ఈ స్కాలర్ షిప్ వర్తింపజేయనున్నట్టు తెలియజేశాడు.
మన దేశాన్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేసే మన సైనికుల సేవలకు గౌరవ సూచకంగా.. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేశాడు మంచు విష్ణు. కాగా రెండేళ్ల క్రితం మంచు విష్ణు 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాడని తెలిసిందే. విష్ణు టైటిల్ రోల్లో నటిస్తోన్న కన్నప్ప 2025 ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Happy Republic Day! Eternally grateful for the Indian Armed Forces 🙏 A Small token of appreciation from Mohan Babu University#RepublicDay #IndianArmedForces #mohanbabuuniversity #JaiHind pic.twitter.com/JGIaAUOh9b
— Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2025
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి