Bhairavam | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో సూపర్ హిట్టైన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధా మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నేడు విడుదల కాగా.. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్‌ను పెట్టాడు.
ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆనందంలో ఉన్న మంచు మనోజ్ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నాడు. తన తండ్రి మోహన్ బాబు పెద్ద రాయుడు ఫొటోను తీసుకుని పక్కన భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు. దీనికి ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు భైరవం సినిమా చూసిన ప్రేక్షకులు మంచు మనోజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత మనోజ్ మంచి హిట్టు కొట్టాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More