Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీర మల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ఇతర నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే, తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం ప్రస్తుతం 94,000 డాలర్ల (సుమారు ₹78 లక్షలకు పైగా) ప్రీ-సేల్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ‘హరి హర వీర మల్లు’ ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్లు పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే కొంత నెమ్మదిగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా, తెలుగు సూపర్ స్టార్ల సినిమాలు ప్రీమియర్లకు 10-12 రోజుల ముందు నుంచే $250K నుండి $500K వరకు ప్రీ-సేల్స్ వసూలు చేస్తాయి.
‘పుష్ప 2’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ ప్రాజెక్టులతో పోలిస్తే, ఈ సినిమాకు USAలో పెద్దగా ప్రీ-రిలీజ్ హైప్ లేకపోవడం దీనికి ఒక కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ, ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్లు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.