Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్ (Panipat)లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వ్యక్తిని సుఖాగా పోలీసులు గుర్తించారు. అతడిని ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు నవీ ముంబై పోలీసులు (Navi Mumbai Police) తాజాగా వెల్లడించారు.
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోనే తాజాగా అరెస్ట్ జరిగింది.
ఇక ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని పోలీసులు ఛార్జిషీట్లో ప్రస్తావించారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులో సల్మాన్‌ను హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
నటుడి హత్యకు మోడ్రన్ వెపన్స్ (modern weapons) కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది.
Also Read..
Nayab Singh Saini | హర్యానాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. సీఎంగా సైనీ ప్రమాణం
Samantha | కొండా సురేఖ కామెంట్స్‌పై మరోసారి స్పందించిన సమంత
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే