Nayab Singh Saini | హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Haryana Chief Minister) బీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా సీఎంగా ఆయన వరుసగా రెండోసారి ప్రమాణం చేశారు. సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. సైనీతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in Panchkula
Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd
— ANI (@ANI) October 17, 2024
పంచకుల (Panchkula)లోని సెక్టార్ 5లో గల దసరా గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు.
#WATCH | Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Assam CM Himanta Biswa Sarma, Gujarat CM Bhupendra Patel and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini, in Panchkula pic.twitter.com/mDQ6OLvOjy
— ANI (@ANI) October 17, 2024
అంతకు ముందు సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించిన బీజేపీ మార్చిలో సైనీని ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, విపక్ష కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.
#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p
— ANI (@ANI) October 17, 2024
Also Read..
Meta Layoffs | ఉద్యోగులకు షాక్.. మెటా మరోసారి లేఆఫ్స్
Vistara flight | జర్మనీ నుంచి వస్తున్న విస్తారా ఫ్లైట్‌కు బెదిరింపులు.. ముంబైలో సేఫ్ ల్యాండింగ్
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..