Meta Layoffs | ఉద్యోగులకు షాక్.. మెటా మరోసారి లేఆఫ్స్
Meta Layoffs | ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
Meta Layoffs | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లేఆఫ్స్ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత మాంద్యం భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్స్ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్.. వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.
కాగా, మెటా ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో ఏకంగా 11 వేల మందిపై వేటు వేసింది. ఇక గతేడాది రెండు విడతల్లో సుమారు 10 వేల మందిని ఇంటికి సాగనంపింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దం కావడం టెక్ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. లేఆఫ్స్ గురించి ఇప్పటికే సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Vistara flight | జర్మనీ నుంచి వస్తున్న విస్తారా ఫ్లైట్‌కు బెదిరింపులు.. ముంబైలో సేఫ్ ల్యాండింగ్
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 15వ ఘటన
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

