Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మీర్జాపూర్‌కు చెందిన 20 ఏళ్ల అశుతోష్ చౌరాసియా.. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు (NEET Aspirant). కోటాలోని దాదాబరీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ హాస్టల్లో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కాగా, విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. వారు పీజీ యజమానిని సంప్రదించారు. దీంతో అతను అశుతోష్ రూమ్ వద్దకు వెళ్లి తలుపు కొట్టగా.. ఎలాంటి స్పందనా లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రూమ్ డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అశుతోష్ ఉరేసుకొని కనిపించాడు. విద్యార్థి మృతి సమాచారాన్ని వెంటనే అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 15వ ఘటన కావడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
Also Read..
Snake | కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. వీడియో వైరల్
Petrol bomb | శివ సేన నేత ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
Spurious Liquor | బీహార్‌లో కల్తీమద్యం తాగి 24 మంది మృతి