యమదొంగ, చింతకాయల రవి, కింగ్, కేడి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ భామ మమతామోహన్ దాస్ (Mamta Mohandas) . ఈ బ్యూటీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించక చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నటిస్తోన్న రుద్రాంగి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నేడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటుందీ భామ.
బర్త్ డే సందర్భంగా మూవీ లవర్స్, ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. మమతా మోహన్ దాస్ తాజాగా మలయాళంలో సోషల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో నటిస్తోన్న చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ను పెట్టారు. ఈ మూవీ టైటిల్ లైవ్ (Live). ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మీడియా వ్యక్తులంతా రౌండప్ చేసినట్టు కనిపిస్తున్న ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. ఫిలిమ్స్ 24 బ్యానర్‌పై దర్పన్ బంగేజా, నితిన్ కుమార్ నిర్మిస్తున్నారు. అల్ఫోన్స్ జోసెఫ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. శౌబిన్ షాహిర్, షినే టామ్ ఛకో, ప్రియా వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ సురేశ్ బాబు కథనందిస్తున్నాడు.
Just posted a photo https://t.co/Ozj1rUqxsV
— Mamta Mohandas (@mamtamohan) November 14, 2022
Read Also : Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
Read Also :టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Read Also : Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్