సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి (Continental hospital) వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మీడియాతో డాక్టర్లు మాట్లాడుతూ.. కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిడ్నీ, లివర్ లంగ్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా డయాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు.
కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులతో కూడిన 8 మంది డాక్టర్ల టీం చికిత్స కొనసాగిస్తోంది. మిగితా అవయవాల పనితీరు మందగించింది. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం. ఉదయం నుంచి ఎలాంటి మార్పు లేదు. చికిత్సకు స్పందిస్తున్నారని ఇప్పడే ఏం చెప్పలేం. ప్రస్తుతానికి నిలకడగా ఉన్నారు.. కానీ పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మధ్యాహ్నం 1 గంటకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డాక్టర్లు చెప్పారు.
Read Also : Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
Read Also :టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Read Also : Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్