టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ నటుడు డీఎంకే మురళి (DMK Murali) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. డీఎంకే మురళి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. డీఎంకే మురళి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు.
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు డీఎంకే మురళి (DMK Murali) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. డీఎంకే మురళి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. డీఎంకే మురళి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు.
నటనపై ఉన్న ఆసక్తితో రంగస్థలంలోకి అడుగుపెట్టిన మురళి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించారు. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో డీఎంకే మురళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఓ వైపు జర్నలిస్ట్‌గా పనిచేస్తూనే.. సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించారు.
సినిమాల కోసం తిరిగే క్రమంలో ఆయనకు అందాల రాక్షసి సినిమాలో అవకాశం వచ్చింది. మారుతి డైరెక్ట్ చేసిన బస్‌స్టాప్, నాగచైతన్య-సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాఖా, కొత్త జంట, కాయ్ రాజా కాయ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also : Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
Read Also :Krishna | 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం..విషమంగా కృష్ణ ఆరోగ్యం : డాక్టర్లు
Read Also : Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

