Navya Nair | కేరళకు చెందిన ఓ నటికి ఆస్ట్రేలియాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు షాకిచ్చారు. మల్లెపూలు (Jasmine Flowers) తీసుకెళ్లినందుకు భారీ ఫైన్ వేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మలయాళీలకు ఓనం పండగ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా (Malayali Association of Victoria) ఓనం వేడుకలను (Onam celebrations) నిర్వహించింది. కేరళకు చెందిన నటి (Malayali Actress) నవ్య నాయర్ (Navya Nair) ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లో మల్లెపూలు ఉన్నాయి. దీంతో మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Melbourne Airport)లో ఆమెను అధికారులు ఆపారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్ వేశారు. ఈ విషయాన్ని నటి అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆస్ట్రేలియా వచ్చే ముందు తన కోసం తన తండ్రి మల్లెపూలు కొని తెచ్చినట్లు తెలిపారు. అయితే, అందులో కొన్నింటిని తలలో పెట్టుకోగా.. మరికొన్నింటిని తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు వివరించారు. తాను చేసింది చట్ట విరుద్ధమే అయినా.. తెలియక చేసినట్లు పేర్కొన్నారు. పొరపాటున జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, మల్లెపూల కారణంగా అధికారులు తనకు రూ.1.14 లక్షల ఫైన్ వేసినట్లు చెప్పారు. ఆ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు తనకు చెప్పినట్లు నటి వివరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Bigg Boss | లక్షలు వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యేగం.. అన్నీ వదిలేసి బిగ్ బాస్ హౌజ్‌లోకి
Lawrence | లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలుతో పాటు సొంత ఇల్లు