శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 08:48:02

శ్రీమ‌తికి మ‌హేష్ బ‌ర్త్‌డే విషెస్.. పోస్ట్ వైర‌ల్

శ్రీమ‌తికి మ‌హేష్ బ‌ర్త్‌డే విషెస్.. పోస్ట్ వైర‌ల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీ ప‌ర్సన్ అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఎక్కువ‌గా కుటుంబంతోనే స‌మ‌యం గ‌డిపేందుకు ఆస‌క్తి చూపుతుంటారు మ‌హేష్‌. ఈ రోజు త‌న శ్రీమ‌తి న‌మ్ర‌త బ‌ర్త్‌డే 49వ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమె పుట్టిన‌రోజుని వెరైటీగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేసిన మ‌హేష్ గురువారం రోజు దుబాయ్  వెళ్ళారు. అక్క‌డ న‌మ్ర‌త బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రప‌నున్నాడు. 

 జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ అయితే త‌న శ్రీమ‌తికి స్పెష‌ల్ విషెస్ అందించారు. ఈ రోజు నేను ఎంతో ప్రేమించే వ్య‌క్తి పుట్టిన రోజు. ప్ర‌తి రోజు నీతో గ‌డ‌ప‌డం నాకు ప్ర‌త్యేకం. కాని ఈ రోజు మ‌రింత ప్ర‌త్యేకంం. అద్భుత‌మైన స్త్రీతో అంద‌మైన రోజు.. ప్రేమ‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు లేడీ బాస్ అంటే మ‌హేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుది. ప్ర‌స్తుతం మహేష్ స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

VIDEOS

logo