Mahesh Babu | పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu). సినిమాలు, యాడ్స్‌తో బిజీగా ఉండే మహేశ్ బాబు టైం దొరికితే చాలు.. వెకేషన్ ప్లాన్ చేస్తాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ వేశాడు. న్యూయార్క్ వీధుల్లో కూతురు సితారను ఆప్యాయంగా హగ్ చేసుకున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
మరోవైపు నమ్రతా శిరోద్కర్, సితార కూడా సెల్ఫీలు దిగారు. మహేశ్ బాబు ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మహేశ్ బాబు నెక్ట్స్ ఎస్ఎస్‌రాజమౌళితో కలిసి ఎస్ఎస్ఎంబీ29 సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే లాంగ్ హెయిర్, గడ్డంతో స్టైలిష్ అవతార్‌లోకి మేకోవర్ అయ్యాడు మహేశ్ బాబు.
న్యూయార్క్ వీధుల్లో ఇలా..
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ