Mahesh Babu | సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టెలివిజన్ రియాలిటీ షోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది బిగ్ బాస్ (Bigg Boss). తెలుగు, తమిళం, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ వచ్చేస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కొనసాగుతుంది. కాగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్ బాస్ సీజన్ 18లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ తాజా సీజన్ సోమవారం షురూ అయింది. ఈ టీంలోకి టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu) మరదలు శిల్పా శిరోద్కర్ ఎంట్రీ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శిల్పా శిరోద్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత స్క్రీన్‌పైకి కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం అటు మహేశ్ బాబు కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
నమ్రతా శిరోద్కర్ కంటే ముందే సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన శిల్పా శిరోద్కర్.. 90స్ తొలినాళ్లలో వన్ ఆఫ్ ది టాప్ స్టార్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది. మరి బిగ్ బాస్ షోలో ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తుందో చూడాలి.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున