టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్‌బాబు(Mahesh Babu) ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే..మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టుకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ (Adivi Sesh)ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మేజర్ (Major). జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేశ్‌బాబు గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఈ షోలో మేజర్ సినిమా గురించి అడుగగా..సినిమా హీరో అడివిశేష్పై ప్రశంసలు కురిపించాడు మహేశ్‌బాబు.
‘శేష్ అద్బుతంగా నటించాడు..అతనికి హాట్యాఫ్. నేను రషెస్‌ను వీక్షించిన తర్వాత అడివిశేష్‌ను చూసి గర్వంగా ఫీలయ్యా. సినిమా విడుదల కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా..’ అని అడివి శేష్‌ను, సినిమాను మహేశ్ బాబు ప్రశంసలతో ముంచెత్తాడు. ఇప్పటికే విడుదలైన మేజర్ టీజర్ లో మూజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో అడివి శేష్ జీవించేసినట్టు తెలుస్తోంది. మేజర్ చిత్రానికి అడివిశేష్ కథనందిచడం విశేషం.
శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్