Varanasi | టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. రామోజీఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఈ చిత్రానికి వారణాసి టైటిల్‌ను ఫైనల్ చేశారని తెలిసిందే. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
మహేశ్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు (నంది)పై స్వారీ చేస్తున్న విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కాగా ఈవెంట్లో గ్రే కలర్ సూట్లో స్టైలిష్ హెయిర్, గడ్డంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు మహేశ్ బాబు. ఎప్పటిలా కాకుండా ఈ సారి నయా స్టైలిష్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇక ప్రియాంకా చోప్రా సంప్రదాయం ఉట్టిపడేలా లంగావోణిలో కనిపించింది.
సూపర్ కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న తమ అభిమాన హీరోను, చిరునవ్వులు చూసి ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. దీనికి సంబంధించిన విజువల్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో శృతిహాసన్ డ్యాన్స్‌తో స్టేజ్‌ను షేక్ చేసింది. ఈవెంట్లో పృథ్విరాజ్ సుకుమారన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.
ఈవెంట్లో ఇలా..
Sithara papa is speaking our Heart out !❤️
Seeing him like this 🥹🥹❤️❤️
Love you annaya @urstrulyMahesh #GlobeTrotter #SSMB29 #Varanasi pic.twitter.com/QoKWujpkNj— Kukatpally DHFMS (@KukatpallyMBFC) November 15, 2025
Ala chustha undi povacchu 🥹🥹❤️❤️#GlobeTrotter #SSMB29 @urstrulyMahesh pic.twitter.com/JTGauuLfEg
— Kukatpally DHFMS (@KukatpallyMBFC) November 15, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!