Bala Krishna | బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అని అభిమానులు భావిస్తుంటారు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వరుసగా మూడు మెగా హిట్స్ కొట్టిన ఈ కాంబో ఇప్పుడు అఖండ–2తో మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్తా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య హిందీలో ఇచ్చిన స్పీచ్ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.
అంతేకాక, సంగీత దర్శకుడు తమన్‌ను పరిచయం చేస్తూ బాలయ్య చేసిన కామెడీ అందరిని అలరించింది . ఇతను నందమూరి తమన్… నందమూరి మా ఇంటి పేరు… ఇతనికి ఆ పేరు నేనే ఇచ్చేశా. తమన్‌ని నేను దత్తత తీసుకున్నాను!” అంటూ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత తమన్‌ను పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, అయ్యో సార్ వద్దు! అంటూ తమన్ నవ్వుతూ వెనక్కి వెళ్లడంతో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాలయ్య ఎత్తే సమయంలో తమన్ కాస్త కంగారు పడగా, అప్పుడు బాలయ్య.. ఏ నేను ఎత్తలేనా.. ఎత్తి చూపిస్తా అని అనగానే మీరు నా లైఫ్‌నే పైకి తెచ్చారు.. నన్ను ఎత్తలేరా.. అంటూ తమన్ సరదాగా అన్నాడు.
ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ.. బోయపాటితో నేను నాలుగు సినిమాలు చేశాను. మా కాంబో ఎప్పుడూ హిట్. అఖండ ఒక్కటే ₹250 కోట్లు వసూలు చేసింది. తమన్ వరుసగా నా ఐదు సినిమాలకు సంగీతం ఇస్తున్నాడు. నా విజయాలన్నీ భగవంతుడి దయ వల్లే” అన్నారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ..“అఖండ–2 సినిమా మాత్రమే కాదు… భారత ఆత్మ. ధర్మాన్ని ప్రతిబింబించే చిత్రం ఇది. మొత్తం కుటుంబం కలిసి చూడగల సినిమా. కఠినమైన చలి వాతావరణంలో ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు షూట్ చేశాం. మేమంతా స్వెట్టర్లు వేసుకుని వణుకుతుంటే, బాలయ్య మాత్రం పంచె కట్టుకుని షూటింగ్ చేశాడు. అది ఆయన డెడికేషన్‌కు ఉదాహరణ. మా వెనుక శివుడి ఆశీస్సులే ఉన్నాయి” అని చెప్పారు. అఖండ సెన్సేషన్ తర్వాత వచ్చే ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబరు 5న విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం టీమ్‌కు ఉంది.
నందమూరి తమన్ అంటూ ఆటపట్టించిన బాలయ్య ..
#Akhanda2 #NandamuriBalakrishna #Balakrishna pic.twitter.com/kC0Uwm6RWM
— YK TV Network (@YKTvNetwork) November 14, 2025