లైంగిక దోపిడీ జంటకు మరణశిక్ష
దశాబ్ద కాలానికి పైగా మూడేండ్ల చిన్నారి సహా 33 మంది మైనర్ల(బాలుర)పై లైంగిక దోపిడీకి పాల్పడినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భావన్, అతని భార్య దుర్గావతి ఆ రాష్ట్ర ప్రత్యే క కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు.
- ఇంజినీర్ దంపతులకు యూపీ ప్రత్యేక కోర్టు విధింపు
- 33 మంది మైనర్లను వేధించిన కేసులో ఖరారు
న్యూఢిల్లీ: దశాబ్ద కాలానికి పైగా మూడేండ్ల చిన్నారి సహా 33 మంది మైనర్ల(బాలుర)పై లైంగిక దోపిడీకి పాల్పడినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భావన్, అతని భార్య దుర్గావతి ఆ రాష్ట్ర ప్రత్యే క కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేరాలను అత్యంత అరుదైనవిగా పేర్కొన్న పోక్సో కోర్టు 2010 నుంచి 2020 మధ్య రామ్ భగవాన్, అతని భార్య దుర్గావతి బాలురపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించింది. ఇంటర్నెట్ ద్వారా దాదా పు 47 దేశాలకు రెండు లక్షలకు పైగా బాధితుల ఫోటోలు, వీడియోలను ఈ జంట పంపించినట్లు కోర్టు తెలిపింది.
అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీ(పోక్సో) ప్రదీప్ కుమార్ పోక్సో చట్టం నిబంధనల కింద నిందితులను దోషులుగా తేల్చారు. లైంగిక వేధింపులను తీవ్రతరం చేయడం, అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం, పిల్లలతో కూడిన అశ్లీల కంటెంట్‌ని నిల్వ చేయడం, ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 33 మంది బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న నగదును బాధితులకు సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలనిప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆధునిక వ్యవసాయంపై జపాన్‌లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
చుక్కలబోడులో పెన్షన్ పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

