Kapoor Family | బాలీవుడ్ స్టార్ కుటుంబం కపూర్ ఫ్యామిలీకి సంబంధించి నెట్ఫ్లిక్స్ వేదికగా డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ 100వ బర్త్డే సందర్భంగా ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ (Dining With The Kapoors) అనే పేరుతో రూపొందిన ఈ ఫ్యామిలీ డాక్యుమెంటరీ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీలో కపూర్ కుటుంబానికి చెందిన అగ్ర నటులు రణ్బీర్ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ తదితర ప్రముఖులు తమ కుటుంబ అనుబంధాలు, జ్ఞాపకాలు, బాల్యం గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు. బాలీవుడ్ లెజెండ్, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ కుటుంబంలోని ప్రస్తుత తరం స్టార్స్ జీవిత విశేషాలు అభిమానులకు ఆసక్తికరంగా మారనున్నాయి.