మహేశ్ బాబు (Mahesh babu) హీరోగా నటించిన మహర్షి (Maharshi) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు గురుస్వామి (Maharshi Guruswamy ). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గురుస్వామి ఇవాళ తుదిశ్వాస విడిచారు.
‘ఒక్కసారి ఈ మట్టిలో కాలుపెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది…రా’ అంటూ మహర్షిలో రైతు పాత్రలో గురుస్వామి చెప్పే సంభాషణలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రైతు కష్టపడి పనిచేస్తే ఎలా ఉంటదో గురుస్వామి చెప్పే డైలాగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆయన చేసిన ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిలిమ్ చూసి మహర్షి సినిమాలో అవకాశం ఇచ్చారు మేకర్స్. సినిమాలో తాను నాగలిని ఎత్తుకొని నడిచి వచ్చే సన్నివేశంలో తన వెనకాల మహేశ్ బాబు వస్తున్నాడని తెలియదంటూ గురుస్వామి సినిమా ఈవెంట్లో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి.