Bigg Boss 6 Nominations | నామినేషన్స్ లో ఎలిమినేట్ అయ్యేదెవరు..? ప్రోమో
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) సందడిగా మొదలై..ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. గతంలో అయితే బిగ్ బాస్ షో ఆదివారం షురూ అయితే నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నుంచే మొదలవడంతో..ఎవరిని నామినేట్ చేయాలో క్లారిటీ వచ్చేది కాదు.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) సందడిగా మొదలై..ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. ఈ సీజన్లో నామినేషన్స్, కెప్టెన్సీ కొత్తగా సాగుతున్నాయి. గతంలో అయితే బిగ్ బాస్ షో ఆదివారం షురూ అయితే నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నుంచే మొదలవడంతో..ఎవరిని నామినేట్ చేయాలో క్లారిటీ వచ్చేది కాదు. కానీ ఈ సారి నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ హౌస్‌ను క్లాస్, ట్రాష్, మాస్..తరగతులుగా విభజించి టాస్క్‌లు పెట్టాడు.
మొదట క్లాస్, ట్రాష్ టాస్కుల్లో గీతూ రాయల్ (Geetu royal), ఆది రెడ్డి, నేహా చౌదరి టాలెంట్ చూపించి నామినేషన్స్ నుంచి తప్పించుకుని కెప్టెన్సీకి పోటీపడుతున్నారు. ఇక మరోవైపు ఇనయా సుల్తానా, అభినయశ్రీ, బాలాదిత్య నేరుగా నామినేట్ అయ్యారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియ కొత్తగా సాగింది. ఇంట్లో వేస్ట్ అని భావించి ఎవరినైతే ఫ్లష్ అవుట్ చేయాలనుకుంటున్నారో..వారి పేర్లను నిర్మొహమాటంగా బయటపెట్టండని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సూచించాడు.
రేవంత్ వర్సెస్ జబర్దస్త్ ఫైమా..
హౌస్మేట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి పేర్లు ఓ పేపర్‌పై స్టాంప్ వేసి టాయిలెట్ సీట్లో పడేయాలి.టాయిలెట్ సీట్లో ఎక్కువగా ఎవరి పేర్లు పడతాయో వాళ్లే నామినేట్ అయినట్టు లెక్క. నామినేషన్స్ ప్రక్రియలో ఫైమా,రేవంత్ (Revanth)ల మధ్య మాటల యుద్దం నడిచినట్టు తాజా ప్రోమోతో తెలిసిపోతుంది. ఇంట్లో ఫైమా పనిచేయడం లేదని రేవంత్ ఆమె పేరును నామినేట్ చేశాడు. దీనికి నేను పనిచేసేటపుడు నువ్వు అటు వైపు రాలేదేమో..అని ఫైమా చెప్తే..మే బీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనేమో..నాకు ఆ విషయం తెలియదు..అంటూ సెటైరికల్‌గా చెప్పాడు రేవంత్. మరోవైపు అర్జున్ కల్యాణ్ కూడా ఫైమా పేరును నామినేట్ చేశారు. ఫైమాతోపాటు సుదీప, ఆరోహి (Arohi Rao), కీర్తిభట్ కూడా రేవంత్ పేరును నామినేట్ చేశారు.

ఈ నామినేషన్స్ ప్రక్రియలో రేవంత్, ఆరోహి, శ్రీ సత్య, ఇనయా సుల్తానా, ఫైమా , చలాకీ చంటీ, అభినయశ్రీ నిలిచారు. అయితే వీరిలో జబర్ధస్త్ ఫైమా, చలాకీ చంటీ యాక్టివ్‌గా ఉండటంతో వీరిద్దరూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది..వచ్చే ఎపిసోడ్స్‌లో క్లారిటీ రానుంది.
Modhati week nominate ayyedi evaru? 😱
Watch the drama unfold on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#DisneyPlusHotstar #StarMaa pic.twitter.com/UR4qJrRYq4
— Starmaa (@StarMaa) September 7, 2022
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

