Maa Nanna Superhero | టాలీవుడ్ యాక్టర్ సుధీర్‌బాబు (Sudheer Babu) ఇటీవలే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. ‘లూసర్’ వెబ్‌సిరీస్ ఫేం అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కాగా.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాగా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ హృద్యమైన తండ్రీ కొడుకుల కథ ఇప్పుడిక ఓటీటీలో తన లక్ పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరపురాని తండ్రీకొడుకుల హృద్యమైన కథను చూడండి. మీరు ఈ సినిమాను ఇప్పటికే థియేటర్లలో చూసినట్లయితే.. మళ్లీ చూడటానికి ఇష్టపడతారు. అంతేకాదు కొందరు బిగ్ స్క్రీన్‌పై చూడాలని కోరుకుంటారు అని ట్వీట్ చేశాడు సుధీర్ భాబు.
ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్, సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిచంద్, షాయాజీషిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించగా..సునీల్ బలుసు నిర్మించారు.
Catch the heartwarming story of this unforgettable father-son duo, #MaaNannaSuperhero now streaming on Amazon Prime https://t.co/SGiwby35r4 If you have already watched it in theaters, then you will love to watch it again and others; you’ll be wishing you caught it on the big… pic.twitter.com/YeYZDMYoJi
— Sudheer Babu (@isudheerbabu) November 13, 2024
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?