టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ మ్యూజికల్ రైట్స్ ను లహరి మ్యూజిక్ కంపెనీ రూ.25 కోట్లకు దక్కించుకుంది. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ సాంగ్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ టీం.
ఫిక్షనల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తోండగా..జూనియర్ ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత పాత్ర పోషిస్తోంది. సముద్రఖని, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటించగా, రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించింది.
అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పలు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊
— RRR Movie (@RRRMovie) July 27, 2021
An @mmkeeravaani Musical.🎵
🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..