Kubera | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కుబేర (Kubera). ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కుబేర గ్లింప్స్ అప్డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
గ్లింప్స్‌ను ఇవాళ సాయంత్రం 5:31 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ.. షేర్ చేసిన లుక్‌లో ధనుష్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, నోట్లను చూడొచ్చు. ఈ లుక్ గ్లింప్స్, సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అంటూ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
కుబేరలో పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కీ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన జిమ్ సర్బ్ పాత్ర లుక్‌లో.. స్టైలిష్ సూట్లో నోట్ల కట్టల మధ్య నిల్చొని ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.
#KuberaGlimpse releasing at 𝟓:𝟑𝟏 𝐩𝐦 today!
Get ready to witness the world of Kubera 💥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @nikethbommi #PingaliChaithanya @AsianSuniel #Puskurrammohan @SVCLLP @amigoscreation… pic.twitter.com/8Mc1ERKvOh
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2024
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట