పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). కొత్త షెడ్యూల్ కోసం క్రిష్ (Krish) అండ్ పవన్ టీం ఇటీవలే వర్క్ షాప్‌లో కూడా పాల్గొన్నది. కాగా షూటింగ్‌పై తాజా అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం క్రిష్ రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నాడు.
పవన్ డూప్‌తో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నాడట. పవన్ తర్వాత సెట్స్ లో జాయిన్ కానుండగా..పవన్ క్లోజప్ షాట్స్ క్రిష్ తీయబోతున్నాడని ఇన్సైడ్ టాక్. హరిహరవీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రన్నా 2023 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్.
Read Also : Jr NTR | పునీత్ రాజ్‌కుమార్ కింగ్ ఆఫ్ స్మైల్.. జూనియర్ ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ వీడియో వైరల్
Read Also : Gowtam Tinnanuri | రాంచరణ్ సినిమా నుంచి తప్పుకున్న గౌతమ్ తిన్ననూరి..!
Read Also : Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Also : HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
Read Also : Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో