Kranthi Madhav | శర్వానంద్, నిత్యమీనన్ కాంబోలో వచ్చిన చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. క్రాంతిమాధవ్ దర్వకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా క్రాంతి మాధవ్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ చిత్రం DGL టైటిల్‌తో రాబోతుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కొంతమంది స్నేహితులు ఖాజీపేట్ జంక్షన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తుండగా.. కింద నుంచి రైలు వెళ్తుంది. ప్రయాణం మొదలైంది.. అంటూ లాంచ్ చేసిన ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్తి క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో మొదలు కానుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడట క్రాంతి మాధవ్. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే భిన్నమైన కథతో కొత్త సినిమా తీయబోతున్నాడని ఫస్ట్ లుక్‌తో హింట్ ఇచ్చేస్తున్నాడు డైరెక్టర్.
Sensible Director #KranthiMadhav‘s Next Titled as #DGL 💥
Shoot Begins in November ✨ pic.twitter.com/5JUppVlLID
— Sai Satish (@PROSaiSatish) September 14, 2024
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Journey Re release | శర్వానంద్, అంజలి జర్నీ రీరిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే..?