సినిమా సినిమాకు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోల్లో ఒకడిగా మారాడు కోలీవుడ్ (Kollywood) యాక్టర్ శివకార్తికేయన్ (Shiva Karthikeyan). ఈ హీరోకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు చెన్నై సర్కిల్లో రౌండప్ చేస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేళ్ రాజా ( Gnanavel Raja) పై శివకార్తికేయన్ కేసు ఫైల్ చేశాడని సమాచారం. మిస్టర్ లోకల్ సినిమా కోసం తన రెమ్యునరేషన్లో భాగంగా చెల్లించాల్సిన రూ.4 కోట్ల బ్యాలెన్స్ ను తిరిగివ్వాలని శివకార్తికేయన్ కోర్టును ఆశ్రయించాడని తెలుస్తోంది.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జ్ఞానవేళ్‌రాజా మిస్టర్ లోకల్ (Mr Local) సినిమా కోసం శివకార్తికేయన్‌కు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అందులో రూ.4 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో శివకార్తికేయన్ కోర్టును ఆశ్రయించినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. కాగా తమిళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన జ్ఞానవేళ్ రాజా తనపై శివకార్తికేయన్ వేసిన కేసును ఎలా హ్యాండిల్ చేస్తాడోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు శివకార్తికేయన్. ఈ స్టార్ హీరో ప్రస్తుతం జాతిరత్నాలు హీరో అనుదీప్ కేవీతో కలిసి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.