గత కొన్నాళ్లుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ (Biopics)ల వాహ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు పెద్ద స్టార్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో ధనుష్ (Dhanush) కూడా చేరిపోయినట్టు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఈ యాక్టర్ ఇప్పటివరకు బయోపిక్ లో నటించలేదు. ఒకవేళ తనకు అవకాశమొస్తే ఏ ప్రాజెక్టుల్లో నటించాలనుకుంటున్నాడో చెప్పాడు ధనుష్.
ఇద్దరు లెజెండరీలో బయోపిక్ చేయాలని ఉందని మనసులో మాట బయట పెట్టాడు. వీరిలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), మరొకరు స్వర మాంత్రికుడు ఇళయరాజా (Ilaiyaraja) . మరి ధనుష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రివీల్ చేసిన నేపథ్యంలో..రాబోయే రోజుల్లో అతడి కోరికను నెరవేర్చేందుకు ఏ దర్శకుడు ముందుకొస్తాడో చూడాలి. ఈ స్టార్ హీరో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన అట్రాంగి రే డిసెంబర్ 24న Disney+ Hotstar లో విడుదలైంది.
ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సారా అలీఖాన్, అక్షయ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్ పోషించారు. ఇటీవలే తొలిసారి డైరెక్ట్ తెలుగు చిత్రం సార్ ప్రకటించాడు ధనుష్. ఈ మూవీ తమిళంలో కూడా రాబోతుంది.