Dhanush Telugu movie title | స్టార్ హీరో తొలి తెలుగు సినిమా.. ఇంట్రెస్టింగ్గా టైటిల్ లుక్ వీడియో
స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ (Tollywood) యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ తొలిసారి నేరుగా తెలుగులో చేస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇవాళ లాంఛ్ చేశారు.

దక్షిణాదిన సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఒకడు. ఈ స్టార్ హీరో టాలీవుడ్ (Tollywood) యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ధనుష్ తొలిసారి నేరుగా తెలుగులో చేస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇవాళ లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి సార్ (Sir) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమిళంలో వాథి (Vaathi) అనే పేరు ఫైనల్ చేశారు. ధనుష్ తెలుగులో చేస్తున్న మొదటి చిత్రం మన దేశంలోని విద్యావ్యవస్థలోని పలు అంశాల నేపథ్యంలో సాగనుంది. టైటిల్ ఇంట్రడక్షన్ వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు వెంకీ.
బ్లాక్ బోర్డు, క్లాస్ రూమ్స్, టైటిల్ లుక్ మధ్యలో పెన్, క్లాస్ రూమ్ బయట బెల్ ఇలా విద్యకు సంబంధించిన అంశాలే మెయిన్‌గా సినిమా సాగబోతుందని వీడియోతో తెలిసిపోతుంది. కామన్ మ్యాన్ జర్నీ బ్యాక్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తున్నారు. 2022 జనవరి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ధనుష్ మరోవైపు టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula)తో కలిసి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నారాయణ్‌దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కించనుండగా..దీనికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

