టాలీవుడ్ (Tollywood) ‘ఇస్మార్ట్’ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ది వారియర్ (The Warriorr) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా..రామ్‌కు ఇది కోలీవుడ్ ఎంట్రీ సినిమా కావడం విశేషం. ఈ సినిమాపై ఆసక్తికరమైన అప్ డేట్ తెరపైకి వచ్చింది. పాపులర్ హీరో శింబు ది వారియర్ సినిమాలో ఓ పాట పాడుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాలో వచ్చే బుల్లెట్ సాంగ్‌ను కంపోజ్ చేయగా..శింబు (Simbu) ఈ పాటను ఆలపించాడు.
డైరెక్టర్ లింగుస్వామి, శింబు, రామ్, డీఎస్పీ కలిసి దిగిన ఫొటోతో కలిసి తాజా క్రేజీ అప్ డేట్ ఇపుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ పాట మ్యూజిక్ అండ్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని టాక్. యాక్షన్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ లింగుస్వామి. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కన్నడ భామ అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తోంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నాడు. ఆది పినిశెట్టి ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు చిత్రంలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.