పుష్ప..అల్లు అర్జున్ (Virat Kohli) లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం బాక్సాపీస్ ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దక్షిణాది హీరో అయిన అల్లు అర్జున్ ఈ సినిమాతో నార్తిండియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వెనకేసుకున్నాడు. ఇక ఈ చిత్రంలోని ప్రతీ పాట ఇండియా మొత్తాన్ని షేక్ చేసేలా ఉంటుందని అందరికీ తెలిసిందే. పుష్ప పాటలకు స్టెప్పులేయని క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు, అభిమానులుండనంటే అతిశయోక్తి కాదేమో.
ఇక పుష్పలో సమంత, బన్నీపై ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా మావ (Oo Antava) అంటూ వచ్చే ఊర మాస్ బీట్ థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులేయించింది. సామ్ హాట్ హాట్ అందాలకు సినీ, మ్యూజిక్, డ్యాన్సింగ్ లవర్స్ ఫిదా అయిపోయారు. ఇపుడిదే పాటకు క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫిదా అయిపోయాడు. ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టైలిష్ డ్యాన్స్ చేసి ఔరా అనిపించాడు. ఇటీవల జరిగిన క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్-విని రమణి (గ్లెన్ స్నేహితురాలు) వెడ్డింగ్ ఈవెంట్ (Glenn Maxwell wedding) విరాట్-అనుష్క దంపతులు హాజరయ్యారు.
Virat Kohli & Shabaz Dancing 🕺🥳
Virat Looking So Happy ♥️@imVkohli@RcbianOfficial @RCBTweets#ViratKohli #RCB #Shabazahmed #ViratKohli𓃵 pic.twitter.com/UzX1UKV2Bd— Prajwal (@Prajwal2742) April 27, 2022
ఈవెంట్లో అక్కడున్న కొలీగ్ షబాజ్తో కలిసి ఊ అంటావా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ఏ బ్లాక్ కుర్తా, తెలుపు పైజామాలో ఉన్న విరాట్ పుష్ప డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ పేజీలో తెగ షేర్ చేస్తుండగా..ట్రెండింగ్ అవుతోంది.
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా కియారా తాజా పోస్ట్