Sreeleela | ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల లీల మొదలైంది. తెల్లవారుజామునే షూటింగ్‌కు బయల్దేరితే.. మళ్లీ చీకటి పడ్డాకే ఇంటికి. టాప్ హీరోతో డ్యూయెట్, వర్ధమాన కథానాయకుడితో డేట్ షూట్, ఇంటికి వస్తూవస్తూ ఏ అన్నపూర్ణలోనో ఎమోషనల్ సీన్. కానీ, మొహంలో అలసట ఉండదు. కళ్లలో మెరుపు తగ్గదు. ఆ ఎవర్గ్రీన్ సౌందర్యం వెనుక ఆమె అలవాట్లు ఉన్నాయి. దేన్నయినా యథాతథంగా తీసుకునే జీవనతత్వమూ ఉంది.
ఎలాంటి పాత్ర చేయాలని ఉంది?
చారిత్రక పాత్ర అయివుండాలి. కళాత్మకత తోడుకావాలి.
Sreeleela
అభిమాన నటి, నటుడు?
నటుల కంటే.. పాత్రలు, వ్యక్తిత్వాలను ప్రేమిస్తాను. అందుకే అభిమాన నటుల చిట్టా మారిపోతూ ఉంటారు.
నచ్చిన దర్శకుడు?
నేనెవరితో కలిసి చరిత్ర సృష్టిస్తానో అతనే.
ఫస్ట్ క్రష్?
నా పెంపుడు కుక్క… బీగిల్.
తొలి ప్రేమ?
అమ్మ
ఎలాంటి మనుషుల్ని ప్రేమిస్తారు?
మాటలో నిలకడ, పనిలో పట్టుదల ఉండాలి. ఓర్పు, నేర్పరితనం కనిపించాలి. నన్ను అర్థం చేసుకునేవాళ్లు, నాపట్ల గౌరవం చూపేవాళ్లు, నాతో సరదాగా ఉండేవాళ్లు..
నా వాళ్లు!
ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు?
యోగా, డ్యాన్స్, వ్యాయామాలు, ఆటలు. నేను హాకీ క్రీడాకారిణిని. ఈత అంటే ఇష్టం. జిమ్‌కు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపను.
Sreeleela2
సముద్ర తీరాలా? పర్వత ప్రాంతాలా?
బీచ్‌లు అంటే మక్కువ. సేదతీరేదీ అక్కడే.
శాకాహారమా? మాంసాహారమా?
నేను శాకాహారిని. మసాలా దోశ, ఇడ్లీ ఇష్టంగా తింటాను.
Sreeleela3
ఏ రుచులంటే మక్కువ?
ఇటాలియన్, భారతీయ వంటకాలు. అందులోనూ సౌత్.. సింప్లీ సూపర్బ్!
ఎలాంటి దుస్తులు ఇష్టం?
ఇండో వెస్ట్రన్ ధరించడానికి ఇష్టపడతాను.
Sreeleela4
మెచ్చే రంగులు?
తెలుపు, నేవీ బ్లూ. తెలుపులో ప్రశాంతత, నేవీ బ్లూలో రాజసం ఉట్టిపడతాయి.
ఇష్టమైన పానీయం?
నిమ్మరసం
ఎలాంటి జుట్టు కోరుకుంటారు?
స్ట్రెయిట్ హెయిర్
“Sreeleela | నేనున్నా అని చెప్పండి.. మంచి మనసు చాటుకుంటున్న శ్రీలీల”