Sreeleela | నేనున్నా అని చెప్పండి.. మంచి మనసు చాటుకుంటున్న శ్రీలీల
Sreeleela | వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది అందాల తార శ్రీలీల. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్నూ దక్కించుకుంటూ మిగతా తారలకు అందనంత ఎదుగుతున్నదీ నవనాయిక. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుతున్నది.
Sreeleela | వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది అందాల తార శ్రీలీల. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్నూ దక్కించుకుంటూ మిగతా తారలకు అందనంత ఎదుగుతున్నదీ నవనాయిక. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుతున్నది. తాజాగా ఓ అనాథశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల..అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. ఆడిపాడి వారిని ఉత్సాహపరిచింది.
ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న శ్రీలీల స్పందిస్తూ…‘ఈ పిల్లల్లో ఎన్ని ఆశలు, ఎన్నెన్ని ఆకాంక్షలు, ఎంత ప్రతిభ దాగి ఉందో వారిని కలిసే వరకు తెలియలేదు. వారి నవ్వులతో నా మనసు నిండిపోయింది. మీరూ ఇలాంటి అనుభూతిని పొందాలని కోరుతున్నా. నెలకో, వారానికో ఒక్కసారి సేవా కార్యక్రమంలో పాల్గొనండి. వారికి నేనున్నా అని చెప్పండి. అనాథ పిల్లలను కలిసిన ఫొటోలను ‘హియర్ ఫర్ యూ’ అనే హ్యాష్ట్యాగ్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మీరు పంపే ఫొటోలను చూసేందుకు ఎదురుచూస్తుంటా’ అని పేర్కొంది. ఇటీవల ‘ధమాకా’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న శ్రీలీల ఆ చిత్రంలో ఆమె చేసిన నృత్యాలతో యువ ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మహేష్ బాబు, రామ్ కొత్త చిత్రాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

