Pooja Hedge | పూజా హెగ్డేను డామినేట్ చేస్తున్న శ్రీలీల.. ఈ సారి త్రివిక్రమ్ కూడా చేతులెత్తేసాడుగా..!
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న జాబితాలో కూడా ఈ అమ్మడే టాప్. అయితే గతేడాది నుండి ఈ బ్యూటీకి ఏది కలిసి రావడం లేదు.
Pooja Hedge | నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న జాబితాలో కూడా ఈ అమ్మడే టాప్. అయితే గతేడాది నుండి ఈ బ్యూటీకి ఏది కలిసి రావడం లేదు. ‘రాధేశ్యామ్’ మొదలుకొని ‘సర్కస్’ వరకు ప్రతీది డిజాస్టరే. దాంతో ఒకప్పుడు వరుస సినిమాలతో తీరక లేకుండా గడిపిన పూజాకు.. ఇప్పుడు ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. అందులో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పూజాహెగ్డే ఈ సినిమాపై బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది.
పూజా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే.. ఈ పాటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకోవల్సిన సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. అయితే త్రివిక్రమ్ ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కాకుండా.. కొన్ని మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. అయితే ఈ మార్పుల వల్ల పూజాకు అన్యాయం జరిగిందని సమాచారం. ఈ సినిమాలో ఇద్ధరు హీరోయిన్లు నటించనున్నారు. కాగా సెకండ్ హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఇక పెళ్ళి సందడి, ధమాకా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
దాంతో శ్రీలీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. శ్రీలీలను సెకండ్ హీరోయిన్గా చూడడానికి సిద్ధంగా లేరు. తెరపై ఆమెను స్పెషల్‌గా చూడాలనుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై ‘SSMB28’ చిత్రబృందం చర్చలు జరుపుకొని శ్రీలీలకు ఎక్కువ సీన్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమాలో మహేష్‌కు- శ్రీలీలకు మధ్య ఒక ఫోక్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే ధమాకాలో పల్సర్ బైక్ పాటకు వచ్చిన రెస్పాన్స్‌తో ఈ సినిమాలో కూడా అదే రేంజ్లో ఓ పాటను ప్లాన్ చేస్తున్నారు.
మొదటి నుంచి ఈ సినిమాలో తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావించిన పూజాకు.. ఇప్పుడు మారిన స్క్రిప్ట్‌లో శ్రీలీలకి ఎక్కువ స్కోప్ ఉండటం చూసి ఫీలైపోతుందట. అయితే ఇప్పుడు వరుస వైఫల్యాలతో తానున్న పరిస్థితులల్లో దీని గురించి అడిగితే బాగుండదని తనలో తానే బాధపడుతుందట. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌కు అంతగా స్కోప్ ఉండదు. కానీ ఈ సారి సెకండ్ హీరోయిన్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉండటంతో శ్రీలీల ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

