Sreeleela | శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్.. విజయ్ దేవరకొండకు జోడీగా
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.
Sreeleela In Vijay-Goutham Tinnanuri Movie | ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్‌ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది. డెబ్యూ సినిమాతో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్నా.. ధమాకాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటనే కాదు తన డ్యాన్స్‌లతోనూ అందరితో విజిల్స్ వేయించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కాగా తాజాగా మరో క్రేజీ ఆఫర్ శ్రీలీలను వరించినట్లు తెలుస్తుంది.
రౌడీ స్టార్ విజయ్‌కు జోడీగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తవ్వగానే గౌతమ్ తిన్ననూరి సినిమాన పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
ఇక శ్రీలీల ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, బోయపాటి-రామ్ పోతినేని మూవీ, బాలయ్య 108లలో నటిస్తుంది. వీటితో పాటుగా గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కీరిటీ డెబ్యూ మూవీలోనూ ఆమెనే హీరోయిన్గా నటిస్తుంది. ఇవే కాకుండా మహేష్-త్రివిక్రమ్ సినిమాలోనూ శ్రీలీల నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

