Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Harish Rao | రేవంత్ తనకు తానే ఎన్టీరామారావు కంటే, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే నేనే ఉత్తమ ముఖ్యమంత్రిని అని సెల్ఫ్ డైలాగ్స్, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నడని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Harish Rao | రేవంత్ రెడ్డి.. నేనే విద్యాశాఖ మంత్రిని, పిల్లల భవిష్యత్ కోసం విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా.. నా అంత మంచి పని మంతుడే లేడంటడని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు హరీశ్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ఎక్కడనో మాట్లాడిండు.. అందరి ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటడు. ప్రజలు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏ స్టూడెంట్ ఇవ్వలేదు.. కానీ రేవంత్ తనకు తానే ఎన్టీరామారావు కంటే, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే నేనే ఉత్తమ ముఖ్యమంత్రిని అని సెల్ఫ్ డైలాగ్స్, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నడని ఎద్దేవా చేశారు. నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఈ విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లలు ఇయ్యాలే. రాష్ట్ర ప్రజలు సర్టిఫికెట్ ఇయ్యాలన్నారు.
నువ్వు అందరి ముఖ్యమంత్రుల్లో కెల్లా చెత్త ముఖ్యమంత్రివి.. నీలాంటి చెత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రాలే.. వచ్చినందుకు ఇవాళ పిల్లలు, ప్రజలు బాధపడుతున్నరు.. అంటూ హరీశ్ రావు విమర్శించారు. మరి నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది.. సబితక్క ఇంట్లోకెళ్లి మూసీ సుందరీకరణకు పోతది అంటే పోలీసోళ్లు ముందే వస్తరు.. సబితమ్మ హౌస్ అరెస్ట్.. హరీశ్ రావు టిమ్స్ ఆస్పత్రి చూసేందుకు పోతడంటే పొద్దున్నే పోలీసోళ్లు 6 గంటలకొస్తరు హౌస్ అరెస్ట్.. మేమేక్కడికి పోతమో మాత్రం మీకు రాత్రే తెలుస్తది.. పొద్దుగాళ్ల పోలీసోళ్లు వస్తరు.. మరి ఈ పిల్లల కష్టాలు కనబడతలేవా..? మరి నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది.. నీ కలెక్టర్ ఏం చేస్తుండు.. నీ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది.. ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? అని ప్రశ్నించారు.
ఈ పిల్లలకు ప్రొఫెసర్లు సరిగా లేరు..
ప్రతిపక్షాలు మాత్రం కదిలితే, ధర్నా చేస్తే, ప్రశ్నిస్తే మమ్మల్నేమో హౌస్ అరెస్ట్ చేస్తవ్.. మమ్మల్నేమో ఇంట్లో నుంచి బయటకు పోనియ్యవ్.. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అసలు.. మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది.. కనీసం ఈ పిల్లలకు ప్రొఫెసర్లు సరిగా లేరు.. ల్యాబ్స్ లేవు.. లైబ్రరీ లేదు. వాష్ రూమ్స్ లేవు.. పిల్లలకు బస్ సౌకర్యం లేదు.. రవాణా సౌకర్యం లేదు.. హాస్టల్ సౌకర్యం లేదు.. రెంట్లు కట్టరు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టరు.. అసలు ప్రభుత్వం నడుపుతున్నరా..? లేదా గుడ్డి గాడిదకు పండ్లు తోముతున్నరా..?
దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నానేజ 9 ఏళ్లలో తెలంగాణను అంత గొప్పగా తీర్చిదిద్దుకున్నామన్నారు. మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అసెంబ్లీలో కూడా మీ సమస్యలను లేవనెత్తుతామని అన్నారు.
దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ
ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు
9 ఏళ్లలో తెలంగాణను అంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం
మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అసెంబ్లీలో కూడా మీ సమస్యలను లేవనెత్తుతాం
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

