Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Sreeleela | సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సినిమాపై ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sreeleela | సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా లెజెండరీ నటుడు కమల్ హాసన్‌కు చెందిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ మరియు ‘టర్మరిక్ మీడియా’ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కొద్దికాలంగా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాలలోనూ శ్రీలీల ఈ చిత్రంలో నటిస్తారనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంటూ.. టాలెంటెడ్ నటి శ్రీలీల ‘ధర్మన్’ చిత్రంలో భాగం కాబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన పాత్రలో వైద్యుడిగా (డాక్టర్) కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఎంపిక చేసిన తారాగణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. రామ్ పోతినేని, గ్లామరస్ నటి సిమ్రాన్, రాశీఖన్నా, స్టార్ హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

