పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యూఎస్ భామ శ్రీలీల (Sreeleela). అందం, అభినయంతోపాటు ఇరగదీసే డ్యాన్స్ తో అదరగొట్టేస్తూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామను నెటిజన్లు, మూవీ లవర్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ కారణమేంటను కుంటున్నారా..? రీసెంట్గా మాస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా (Dhamaka) సినిమాలో మెరిసింది శ్రీలీల.
ఈ చిత్రంలో రవితేజ మాస్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా మరోసారి తనలోని టాలెంట్ అంతా బయటపెట్టింది. శ్రీలీలపై ప్రశంసలు కురవడానికి ధమాకా సినిమా కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ భామ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం ఎస్ఎస్ఎంబీ 28 ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది.
శ్రీలీల ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ, తెలుగు బైలింగ్యువల్ ప్రాజెక్ట్ జూనియర్లో నటిస్తోంది. దీంతోపాటు అనగనగా ఒక రాజు, బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతున్న మరో సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి.