Kiran Abbavaram | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కిరణ్ అబ్బవరం-నటి రహస్య గోరక్ (Rahasya Gorak) వెడ్డింగ్‌కు ఆగస్టు 22న ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే వెడ్డింగ్ వెన్యూ ఎక్కడనేది సస్పెన్స్ కొనసాగుతుండగా.. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. కిరణ్ అబ్బవరం- రహస్య గోరక్ వెడ్డింగ్ ఈవెంట్ కర్ణాటకలోని కూర్గ్‌లో జరుగనుంది.
ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరుగనున్నట్టు సమాచారం. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కిరణ్ అబ్బరవరం, రహస్య గోరక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ జనాలు.
హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో మార్చి 13న కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం ఘనంగా జరుగగా.. ఇప్పటికే ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించారని తెలిసిందే. తొలి సినిమాతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.
A New Journey Begins….@Kiran_Abbavaram looks charming in the groom look😍#KiranRahasya #KiranAbbavaram pic.twitter.com/V7l5ro2dVX
— Sai Satish (@PROSaiSatish) August 21, 2024
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్
Mahesh Babu | ముఫాసా: ది లయన్ కింగ్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. ఇంతకీ ఏ పాత్రకో తెలుసా..?