హనుమకొండ చౌరస్తా, జనవరి 1: జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లోని బాల్‌బ్యాడ్మింటన్ గ్రౌండ్స్‌లో జూనియర్ బాలబాలికల సెలక్షన్స్ నిర్వహించనున్నారు. జనవరి 4న ఆదివారం ఉదయం 10 గంటలకు సెలక్షన్స్ ఉంటాయని ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సెక్రటరీ బేర వీరన్న(Bera Veeranna) తెలిపారు.
ప్రతిభ కనబరిచిన బాలబాలికలతో జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని వీరన్న వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జనవరి 10 నుంచి 12 వరకు స్టేట్ లెవల్ టోర్నీ జరుగుతుందని చెప్పారు. కాబట్టి.. ఆసక్తిగల క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొనాలని బాల్‌బ్యాడ్మింటన్ సెక్రటరీ కోరారు.